ఎఫ్ 3 లాంగ్ షెడ్యూల్ ముగిసింది – వరుణ్ తేజ్

Published on Oct 17, 2021 9:00 pm IST

వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్, మెహ్రిన్, తమన్నా భాటియా లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎఫ్ 3 లాంగ్ షెడ్యూల్ ముగిసింది అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. ఇది చాలా ఫన్ గా ఉందని పేర్కొన్నారు. అంతేకాక విక్టరీ వెంకటేష్ తో చేయడం ఎప్పుడూ కూడా బ్లాస్ట్ గా ఉంటుంది అని తెలిపారు. అంతేకాక తర్వాత షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ఎఫ్ 3 చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 చిత్రం కి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :