సాయి తేజ్ నెక్స్ట్ పై వరుణ్ తేజ్ కామెంట్స్

Published on Mar 29, 2022 11:40 am IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకాల పై తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం SDT 15. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ను ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం తాజాగా ఫస్ట్ డే షూటింగ్ జరుపుకుంది. సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత మళ్లీ సెట్స్ మీదకు రావడం తో చిత్ర యూనిట్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ చిత్ర యూనిట్ కి థాంక్స్ తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడం పట్ల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా కామెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ సెట్స్ మీదకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది బావా అంటూ చెప్పుకొచ్చారు. లవ్ యూ, మోర్ పవర్ అని, గుడ్ లక్ అంటూ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :