“గని” కి తన లాస్ట్ వర్క్ ఫినిష్ చేసేసిన వరుణ్ తేజ్.!

“గని” కి తన లాస్ట్ వర్క్ ఫినిష్ చేసేసిన వరుణ్ తేజ్.!

Published on Jan 30, 2022 11:00 AM IST

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ లలో తాను ఎంతో కస్టపడి చేసిన సాలిడ్ యాక్షన్ డ్రామా “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు నుంచో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే అలా లాస్ట్ షెడ్యూల్ కి వచ్చే సరికి మేకర్స్ ఈ సినిమాని కాస్త స్లో గానే కంప్లీట్ చేశారు. మరి ఈ సాలిడ్ చిత్రానికి ఇప్పుడు వరుణ్ తేజ్ తన లాస్ట్ వర్క్ ని ఫినిష్ చేసేసినట్టుగా కన్ఫర్మ్ చేసాడు.

అదే షూటింగ్ అంతా అయ్యిపోయాక తన చిట్ట చివరి డబ్బింగ్ కార్యక్రమాలను కంప్లీట్ చేసినట్టు తన సోషల్ మీడియాలో తెలిపాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద లు నిర్మాణం వహించారు. ఇక అలాగే ఈ చిత్రం మార్చ్ 18న వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు