తెలంగాణా యాస నేర్చుకుంటున్న ‘వరుణ్ తేజ్’ హీరోయిన్

sai-pallavi
శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేస్త్రున్నా చిత్రం ‘ఫిదా’. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిటిత్రం ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. అంతేగా ఈ కథంతా తెలంగాణా, హైదరాబాద్ నైపథ్యంలో సాగనుంది. పైగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రేమమ్ భామ ‘సాయి పల్లవి’ ఒక తెలంగాణా అమ్మాయిగా కనిపించనుంది.

దీంతో తన పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఆమె తెలంగాణా యాసను నేర్చుకుంటోంది. అందుకు కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల సహాయం కూడా తీసుకుంటోందట. సాధారంగానే సహజాతావ్నికి, సమాజానికి దగ్గరగా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అందుకోసమే సాయి పల్లవి ఇంట హార్డ్ వర్క్ చేస్తోందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మిస్తున్నారు.