వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

Published on Apr 11, 2022 9:08 pm IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా గని. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. అయితే, ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.

మరి గని చిత్రం ఫస్ట్ వీకెండ్ కు గానూ ఎంత కలెక్ట్ చేసింది అనేది ఏరియాల వారీగా గమనిస్తే..

నైజాం 1.32 కోట్లు

సీడెడ్ 0.40 కోట్లు

గుంటూరు 0.28 కోట్లు

కృష్ణా 0.25 కోట్లు

నెల్లూరు 0.17 కోట్లు

ఉత్తరాంధ్ర 0.57 కోట్లు

ఈస్ట్ 0.31 కోట్లు

వెస్ట్ 0.21 కోట్లు

ఏపీ + తెలంగాణలో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ : 3.51 కోట్ల షేర్.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 కోట్లు

ఓవర్సీస్ 0.31 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘గని’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ : 4.05 కోట్ల షేర్.

అల్లు బాబీ, సిద్దు ముద్దలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ‘గని’ సినిమాకి రూ.25.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.26 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ప్రస్తుతానికి అయితే.. ఆ పరిస్థితి కనిపించడం లేదు.

సంబంధిత సమాచారం :