రేపు విడుదల కానున్న వరుణ్ తేజ్ “గని” ఫస్ట్ పంచ్!

రేపు విడుదల కానున్న వరుణ్ తేజ్ “గని” ఫస్ట్ పంచ్!

Published on Oct 5, 2021 7:07 PM IST


వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. రెనైస్సాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబు లు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ పంచ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమా పై ఆసక్తి ను పెంచగా, ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ పంచ్ ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ ను రేపు సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు