రాంపేజ్ అదరహో…”గని” టీజర్ తో ఆకట్టుకున్న వరుణ్ తేజ్

Published on Nov 15, 2021 11:22 am IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం ను సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ టీజర్ సూపర్ అనేలా ఉంది. ప్రతి ఒక్కడూ ఛాంపియన్ అవ్వాలని అనుకుంటాడు, కానీ ఒక్కడే అవుతాడు, వై యూ అంటూ, అంతేకాక ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్ లో ఉంటాయి, కానీ గెలిస్తే మాత్రమే చరిత్ర లో ఉంటావ్ అంటూ వచ్చిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :