చిరంజీవి తర్వాతి స్థానం వరుణ్ తేజ్ కే దక్కింది !


మెగా హీరోల్లో అందరికన్నా చివరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, చేసింది నాలుగు సినిమాలే అయినా, వాటిలో కేవలం ఒక్కటి మాత్రమే కమర్షియల్ హిట్ అయినా వరుణ్ తేజ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి తర్వాతి స్థానాన్ని దక్కించేసుకున్నాడు. అదెలాగంటారా అయితే ఇది వినండి. వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ చిత్రం ఓవర్సీస్లో బ్రహ్మాండంగా ఆడుతోంది.

మూడు పూర్తి వారాలు గడిచేసరికి సినిమాకు 1.91 మిలియన్ డాలర్లు అనగా రూ. 12. 8 కోట్లు వచ్చాయి. ఇవి బ్రహ్మాండమైన కలెక్షన్లనే చెప్పాలి. మెగా హీరోల యూఎస్ వసూళ్ల లెక్కలు తీసుకుంటే మొదట 2.4 మిలియన్ అనగా రూ.16. 3 కోట్లతో చిరంజీవిగారి ‘ఖైదీ నెం 150’ ఉంది. ఆ తరవాత 1.8 మిలియన్ డాలర్లతో నిన్నటి వరకు రెండవ పొజిషన్లో ఉన్న ‘అత్తారింటికి దారేది’ని కూడా ‘ఫిదా’ క్రాస్ చేసింది. దీంతో యూఎస్ బాక్సాఫీస్ ముందు మెగాస్టార్ తర్వాతి స్థానం వరుణ్ తేజ్ కే దక్కింది.