తొలిప్రేమను మర్చిపోలేనంటున్న వరుణ్ తేజ్ !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘తొలిప్రేమ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండనుందని మరీ ముఖ్యంగా హీరో యొక్క ఫస్ట్ లవ్ అంటే తొలిప్రేమ గురించే సినిమా అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్లో వరుణ్ తేజ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు.

విజువల్స్, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలోని లిరిక్స్, జీవితంలో తొలిప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం అనే డైలాగ్స్ అన్నీ చక్కగా కుదిరి చిత్ర స్వభావాన్ని తెలియజెప్తున్నాయి. ఇలా సినిమాలో ఏం చెప్పబోతున్నాం అనేది టీజర్ ద్వారా ముందే ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేలా చేయడం సినిమా విజయానికి దోహదం చేసే అంశం. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది.

టీజర్ కోసం క్లిక్ చేయండి: