ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రమే కొరియన్ కనకరాజు.. హారర్ కామెడీ డ్రామాగా కొరియన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ నెలకొంది. ఇక ఈ నమ్మకం తోనే మేకర్స్ అసలు రిలీజ్ డేట్ కంటే ముందే థియేటర్స్ లో సందడి చేయడానికి రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్ట్ 6 రాత్రి పైడ్ ప్రీమియర్స్ తోనే ఆటలు మొదలు కానున్నట్లు వరుణ్ తేజ్ లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేసాడు. తమ సినిమాపై ఉన్న గట్టి నమ్మకం తోనే ఈ స్టెప్ తీసుకున్నట్టు తను తెలిపాడు. సో ఆ నమ్మకాన్ని సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version