వారెవ్వా.. వరుణ్ తేజ్ మేకోవర్ మామూలుగా లేదుగా..!

వారెవ్వా.. వరుణ్ తేజ్ మేకోవర్ మామూలుగా లేదుగా..!

Published on Nov 4, 2021 12:10 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన బాడీ మార్పును చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు.
వరుణ్ తేజ్ మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వారెవ్వ అంటుంది. తాజాగా విడుదలైన వరుణ్ ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నాడు. అచ్చంగా హాలీవుడ్ హీరో మాదిరి ఉన్న వరుణ్ తేజ్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబీ గని సినిమాను నిర్మిస్తుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు