సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “గని” ట్రైలర్.!

Published on Mar 17, 2022 10:54 am IST

మెగా ఫ్యామిలీ హీరోస్ లో ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ తో అలరించే హీరోలలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. మరి వరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రం “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మొదటి నుంచి మంచి బజ్ ఉన్న ఈ చిత్రం ఆ అంచనాలను రీచ్ అయ్యే విధంగా ఈ ట్రైలర్ కట్ ని మేకర్స్ రెడీ చేసారని చెప్పాలి. ముఖ్యంగా వరుణ్ క్యారక్టరైజేషన్ ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఇదివరకు చూడని వరుణ్ తేజ్ ని ఈ సినిమాలో మంచి పర్సనాలిటితో అంతకు మించిన అగ్రెసివ్ మోడ్ లో తాను కనిపిస్తున్నాడు.

అలాగే దర్శకుడు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో పాటుగా హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో వరుణ్ కి మంచి లవ్ ట్రాక్ వారి కెమిస్ట్రీ బాగుంది. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటి నదియా కన్నడ నటుడు ఉపేంద్ర మరియు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి లు కనిపిస్తున్నారు.

అలాగే ఆ బాక్సింగ్ సెటప్ అంతా కూడా మాంచి రియలిస్టిక్ గా కనిపిస్తుంది. వీటితో పాటు డైలాగ్స్, థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తానికి అయితే మంచి యాక్షన్ ఎలిమెంట్స్ సహా ఫ్యామిలీ యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే రానున్న ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :