అప్పుడే ఒక షెడ్యూల్ పూర్తి చేసేసిన వరుణ్ తేజ్ !


ఇటీవలే ‘ఫిదా’ తో ఘనమైన విజయాన్ని అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నటుడి నుండి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన మొదలుపెట్టిన సినిమాను చక చకా కానిచ్చేచేస్తున్నారు. సినిమా గత జూలై నెల ఆఖరి వారంలో ఆరంభం కాగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తైపోయింది.

ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్ తో పాటు కొన్ని పోరాట సన్నివేశాల్ని కూడా తెరకెక్కించారట. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుత స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రాశి ఖన్నా వరుణ్ తేజ్ కు జోడిగా నటింస్తోంది.