అదిరే యాక్షన్ అండ్ ఫస్ట్ లుక్ తో వరుణ్ తేజ్ నెక్స్ట్.!

Published on Jan 19, 2023 11:08 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి వరుణ్ బర్త్ డే ఈ రోజు కాగా తనకి తన కుటుంబం నుంచి అలాగే సినీ ప్రముఖులు తనకి బర్త్ డే విషెష్ చేస్తున్నారు. ఇక ఈరోజే తన కెరీర్లో మరో కొత్త ప్రాజెక్ట్ అయినటువంటి తన కెరీర్ 12వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.

మరి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం అయితే ఇప్పుడు టైటిల్ ని రివీల్ చేసుకుంది. మరి మేకర్స్ ఓ క్రేజీ అండ్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కలిగిన మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేసి సినిమా టైటిల్ ని “గాండీవధారి అర్జున” అని రివీల్ చేసారు.

మరి దీనికి అనుగుణంగా వరుణ్ తేజ్ కూడా మంచి యాక్షన్ మోడ్ లో ఇంటెన్స్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అయితే ప్రవీణ్ సత్తారు మరియు వరుణ్ నుంచి ఓ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ లో మిక్కీ జే మేయర్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. మరి బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :