ఒకే సినిమాలో మూడు లుక్స్ ట్రై చేస్తున్న మెగా హీరో !
Published on Oct 31, 2017 6:00 pm IST

ఇటీవలే ‘ఫిదా’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మెగా వరుణ్ తేజ్. ఈ చిత్రంతో ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అభినయంతో పాటు అందం కూడా ఉండటమే ఇందుకు కారణం. అందుకే వరుణ్ తేజ్ ఈసారి చేయబోయే సినిమాలో లుక్స్ పరంగా ఇంకాస్త బెటర్ గా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. అంతేకాదు ఇందులో వరుణ్ ఏకంగా మూడు గెటప్స్ లో కనిపించనున్నాడు.

ఈ మూడు గెటప్స్ కూడా వేటికవే భిన్నంగా, స్టైలిష్ గా ఉంటాయని టాక్. ఇప్పటికే ఈ మూడు లుక్స్ నుండి ఒకటి బయటికొచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటుండగా త్వరలోనే ఆ రెండు గెటప్స్ ఎలా ఉంటాయో రివీల్ కానున్నాయి. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న వాలెంటైన్స్ డే సందర్బంగా రిలీజ్ కానుంది.

పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాల్లో వరుణ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook