“వరుణ్ తేజ్” బీస్ట్ ట్రైనింగ్ వీడియో చూశారా?

Published on Aug 2, 2021 7:27 pm IST

వరుణ్ తేజ్ సినిమా సినిమా కి చేంజ్ కనబరుస్తూ వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ ఘని చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపంచబోతున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ బీస్ట్ వర్కౌట్ లతో వరుణ్ సినిమా కోసం సిద్దం అవుతున్నారు.

పుల్ అప్స్ చేస్తూ ఉన్నటువంటి ట్రైనింగ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుణ్ తేజ్ ఘనీ చిత్రం లో ఎలా ఉండబోతున్నారు అనేది త్వరలో ఒక వీడియో ద్వారా చిత్ర యూనిట్ తెలియ జేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణం గా సినిమా షూటింగ్, విడుదల వాయిదా పడటం తో త్వరలో దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :