‘గని’ బర్త్ డే టీజర్.. బీస్ట్ మోడ్ లో అదిరిపోయిన వరుణ్ తేజ్.!

Published on Jan 19, 2022 11:27 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరోస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి సినిమాకి వైవిధ్యతను తీసుకుంటూ కాస్త కొత్త లైనప్ నే ఎంచుకుంటూ వస్తున్నాడు. ఫలితం ఎలా వచ్చినా తన సినిమాలు మాత్రం ఉంటాయన్న మార్క్ ని వరుణ్ తెచ్చుకోగలిగాడు.

అలా తాను హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈరోజు వారు తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో వరుణ్ తేజ్ మాత్రం స్టన్నింగ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి. తనలోని యాంగ్రీ వెర్షన్ తో కట్ చేసిన ఈ టీజర్ అదిరే యాక్షన్ ఎలిమెంట్స్ తో కనిపిస్తుంది. ఇంకా ఇందులో కార్ సీక్వెన్స్ లాస్ట్ లో బాక్సింగ్ కోర్ట్ లో తన పై సీన్ చూస్తే బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్టే అనిపిస్తుంది.

మొత్తానికి మాత్రం ఈ సినిమాలో వరుణ్ తేజ్ లోని సరికొత్త కోణం చూడడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ టీజర్ లో మరో హైలైట్ గా థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కూడా చెప్పాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :