వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

Published on May 27, 2023 9:01 PM IST

యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గాండీవధారి అర్జున. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల హంగేరీ లో ఈ మూవీ యొక్క కీలక సీన్స్ చిత్రీకరించిన యూనిట్ నేటితో అక్కడి షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిందని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. హై ఆక్టేన్ యాక్షన్ మూవీ కోసం వేచి చూడండి అంటూ హంగేరీ నుండి టీమ్ మొత్తం దిగిన పిక్ ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా ఈ మూవీలో వినయ్ రాయ్ నెగటివ్ పాత్ర చేస్తుండగా దీని రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు