లేటెస్ట్: వరుణ్ తేజ్ “గాండీవధారి అర్జున” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 7, 2023 7:06 pm IST

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జునలో కనిపించనున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ప్రపంచ సమస్య ఆధారంగా రూపొందించబడింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో తెరంగేట్రం చేసిన సాక్షి వైద్య వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఆగస్ట్ 25, 2023న ఈ చిత్రం థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. వరుణ్ తేజ్ సూట్ ధరించి, తుపాకీ పట్టుకొని స్టైలిష్ గా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లో 12వ చిత్రం గాండీవధారి అర్జున. చిరు యొక్క భోళా శంకర్ విడుదలైన రెండు వారాల తర్వాత వరుణ్ చిత్రం ధియేటర్ల లోకి రాబోతోంది.

సంబంధిత సమాచారం :