“ఆర్ఆర్ఆర్” మూవీ కి గని ట్రైలర్…ప్రమోషన్స్ షురూ!

“ఆర్ఆర్ఆర్” మూవీ కి గని ట్రైలర్…ప్రమోషన్స్ షురూ!

Published on Mar 22, 2022 2:40 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా గని పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. అయితే సౌత్ థియేటర్ల లో వెయ్యి కి పైగా ఈ చిత్రం ప్రదర్శన లో గని ట్రైలర్ ను ప్రమోట్ చేయనున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు