వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన వరుణ్ తేజ్ “గని”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన వరుణ్ తేజ్ “గని”

Published on Jul 1, 2022 8:00 PM IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని, అభిమానులను ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా జెమిని టీవీ లో త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు