తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !

sai-pallavi
మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవికి ఆ తరువాత అన్ని భాషల పరిశ్రమల్లోనూ బోలెడు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆమె మాత్రం తొందర పడకుండా బాగా ఆలోచించి మరీ తనకు సోటయ్యే కథలనే ఎంచుకుంటోంది. ప్రేమమ్ విడుదల వెంటనే తెలుగులో ఆమెకు ఆఫర్లు వచ్చినా మొన్నీ మధ్యే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ తేజ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఫిదా’ కి సైన్ చేసి తెలుగు ఎంట్రీకి సిద్ధమైంది.

అదే బాటలో ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనుంది సాయి పల్లవి. 2015లో మలయాళంలో విడుదలై సూపర్ హిట్టైన ‘చార్లీ’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయనున్నాడు దర్శకుడు విజయ్. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ రీమేక్ లో సాయి పల్లవి ఒరిజినల్ వెర్షన్ లో పార్వతి చేసిన పాత్రను పోషించనుంది. ఈ చిత్రంతో సాయి పల్లవి తమిళ ఆరంగేట్రం కూడా జరిగిపోనుంది. ఇకపోతే ఈ రీమేక్ కు లియోన్ జేమ్స్ సంగీతం అందించనుండగా, నిర్వాణ షా సినిమాటోగ్రఫీ చేయనున్నాడు.