వాయిదాపడిన వరుణ్ తేజ్ ‘మిస్టర్’ !
Published on Apr 5, 2017 2:35 pm IST


మెగాహీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘మిస్టర్’ వాయిదాపడింది. మొదట సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ దాన్ని ఒక రోజు ముందుకు జరిపి ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మళ్ళీ ఇప్పుడేమైందో తెలియదు కానీ సినిమాను మరోసారి వాయిదా వేసి మొదటగా అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.

పోయిన సంవత్సరం ఒక సినిమా కూడా చేయని వరుణ్ తేజ్, గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబందిపడుతున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ ప్రాజెక్ట్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. శ్రీను వైట్ల ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా తన పాత స్టైల్లో తీశారట. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ లు కూడా చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 7న నిర్వహించనున్నారు. ఇకపోతే మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో వరుణ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook