మెగా హీరో కొత్త సినిమా విశేషాలు !


మెగా హీరో వరుణ్ తేజ్ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రారంభించాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ చిత్రాలు మెగా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇటీవల మిస్టర్ చిత్రంతో ఆడియన్స్ ని పలకరించిన వరుణ్ త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఫిదాతో రానున్నాడు. కాగా వరుణ్ తేజ్ నేడు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నేడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ముహూర్త కార్యక్రమానికి హాజరైన కీరవాణి క్లాప్ ఇచ్చారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.