పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ మూవీ టైటిల్ తో వరుణ్ తేజ్ ?

2nd, September 2017 - 10:21:41 AM


ఫిదా చిత్రంతో తన కెరీర్ లో వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. తన తదుపరి చిత్రాల విషయంలో వరుణ్ తేజ్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం వరుణ్ తేజ్ మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం ద్వారా తొలి ఘనవిజయాన్ని అందుకున్నాడు. ప్రేమ కథా చిత్రాల్లో తొలిప్రేమ ఒక సంచలనం.

అదే టైటిల్ తో వరుణ్ తేజ్ చిత్రం రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తొలి ప్రేమ టైటిల్ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయింది. దీనితో ఆ టైటిల్ వరుణ్ మూవీ కోసమే అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.