ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న మెగా హీరో సినిమా !
Published on Oct 30, 2017 3:52 pm IST


‘ఫిదా’ చిత్రంతో కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే 30 రోజుల లండన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ఈ చిత్రానికి పవన్ సూపర్ హిట్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ ప్రస్తావనలో కూడా ఉంది.

ఇంకొద్దిరోజుల్లో చిత్రీకరణ మొత్తాన్ని పూర్తిచేసుకోనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత్ దర్శకుడు థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

 
Like us on Facebook