వరుణ్ తేజ్ “గాండీవధారి అర్జున” యూఎస్ రైట్స్ ను సొంతం చేసుకున్న విలేజ్ గ్రూప్!

Published on Mar 1, 2023 2:42 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే ఇండస్ట్రీ లో ఆసక్తి నెలకొంది. గని చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైన ఈ హీరో, ఈ సారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన యూఎస్ థియేట్రికల్ రైట్స్ ను విలేజ్ గ్రూప్ మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :