వరుణ్ తేజ్ కాస్త తొందరపడుతున్నాడు !


మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సంవత్సరం రెండు సినిమాల్ని ప్లాన్ చేశాడు. వాటిలో ముందుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజైన టీజర్, ట్రైలర్, కొన్ని పాటలు బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను ఈ మార్చి నెల 30వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అలాగే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది.

ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నపటికీ ఎందుకో తేజ్ కాస్త తొందర చూపిస్తూ తేదీని ఒకరోజు ముందుకు జరిపి ఏప్రిల్ 13ను ఖాయం చేశారు. వరుణ్ తేజ్ గతేడాది ఒక్క సినిమా కూడా చేయకపోవడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఈ ప్రేమ కథా చిత్రం మీద మంచి నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే తేజ్ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘ఫిదా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ను కూడా చేస్తున్నాడు.