మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గాండీవధారి అర్జున మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ వారు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.తెలుగు, హిందీ ద్విభాషా మూవీగా రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ లో భారతదేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులని చూపించనున్నారు.
వరుణ్ తేజ్ ఈ సినిమాలో వీర వైమానిక దళ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు పోస్టర్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 8న ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా మూవీ నుండి టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ కి జోడీగా మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. రిలీజ్ అనంతరం తప్పకుండా తామందరి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తమ చిత్రానికి ఆడియన్స్ అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.