ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ వరుస ఆఫర్లతో కోలీవుడ్లో బిజీనటిగా మారింది. ఇక ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. ‘ఉన్నాయ్ అరింధాల్’ అనే టీవీ రియాల్టీ షో కు హోస్ట్ గా చేస్తున్నారు. సామాజిక అంశాల చర్చా వేదిక గా రానున్న ఈ షో అక్టోబర్ 14న నుండి జయ టీవీ ఛానెల్ లో ప్రసారం కానుంది. ఇక ఆమె నటించిన ‘సర్కార్, పందెంకోడి 2’ చిత్రాలు విడుదలకు సిద్దమవవుతున్నాయి.
ఇక ప్రముఖ హీరో వరలక్ష్మి స్నేహితుడు విశాల్ కూడా ఇటీవల ‘సన్ నామ్ ఒరువర్’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇంతకుముందు తెలుగులో ‘మేము సైతం’ పేరుతో ప్రసారమైంది. ఈ షో కి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరించారు.
