VD12: శ్రీ లీల ప్లేస్ లో రష్మిక…అసలు క్లారిటీ ఇదే!

Published on Oct 3, 2023 11:13 am IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఖుషీ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD 12 లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమా లో శ్రీ లీల ప్లేస్ లో రష్మిక మందన్న ను తీసుకున్నట్లు పలు పుకార్లు వ్యాపించాయి. అయితే వీటిపై నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ ఇచ్చారు.

VD 12 లో శ్రీలీల మాత్రమే హీరోయిన్ గా నటిస్తుంది అని, ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయల తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :