సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక ట్వీట్ చేసింది. పుట్టినరోజు శుభకాంక్షలు విజయ్ దేవరకొండ. మీ పాజిటివ్ ఎనర్జీ టీమ్ కి ఒక్ వైల్డ్ ఫైర్ ను ఇస్తోంది. అని మెసేజ్ చేశారు మేకర్స్.
కాగా ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే ఇందులో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ – సామ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.
Happy Birthday Dearest @TheDeverakonda ❤️
Your positive energy is like a wildfire to the entire team ????#VD11 update in the morning ???? https://t.co/3tqInIKQdj
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022