నెక్ట్స్ షెడ్యూల్ కోసం శ్రీ‌లంకకు వెళ్ల‌నున్న‌ VD12 టీమ్

నెక్ట్స్ షెడ్యూల్ కోసం శ్రీ‌లంకకు వెళ్ల‌నున్న‌ VD12 టీమ్

Published on Jul 1, 2024 7:00 PM IST

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రస్తుతం త‌న నెక్ట్ప్ సినిమాను ‘జెర్సీ’ చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. VD12 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల వైజాగ్ లో జ‌రిగింది.

ఈ వైజాగ్ షెడ్యూల్ 30 రోజుల పాటు సాగింది. ప‌లు కీలక స‌న్నివేశాల‌ను ఈ వైజాగ్ షెడ్యూల్ లో చిత్రీక‌రించారు. ఇక ఇప్పుడు త‌మ నెక్ట్స్ షెడ్యూల్ కోసం VD12 టీమ్ రెడీ అవుతోంది. అయితే ఈ షెడ్యూల్ ను శ్రీ‌లంక‌లో షూట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌లంక షెడ్యూల్ కూడా 20-30 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఈ షెడ్యూల్ కోసం శ్రీ‌లంక‌కు వెళ్ల‌నున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య‌శ్రీ బొర్సె నటిస్తోంది. శ్రీ‌లంక షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొన‌నుంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు