తన ఊరి కోసం ఉదారత చాటుకున్న “వీరసింహా రెడ్డి” దర్శకుడు.!

Published on Mar 23, 2023 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ని “వీరసింహా రెడ్డి” అనే సినిమాతో ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా బాలయ్య కెరీర్ లో భారీ హిట్ గా నిలవగా ఒక ఫ్యాన్ బాయ్ గా అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాని నందమూరి అభిమానులకి ఒక గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించాడు. మరి ఈ దర్శకుడు అయితే తాజాగా తాను పుట్టిన సొంత ఊరి పట్ల ఉదారత చాటుకోవడం వైరల్ గా మారింది.

తాను పుట్టిన ఊరు బొద్దులూరి వారి పాలెం లో అయితే గత కొన్నాళ్ల నుంచి సరైన బస్సు షెల్టర్ సదుపాయం లేకపోవడంతో తన సొంత ఖర్చు తో అయితే ఆ షెల్టర్ ని నిర్మాణం వహించడం జరిగింది. దీనితో తమ ఊరికి తాను చేసిన పనితో ఊరి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ దర్శకుడు చాటుకున్న ఉదారత సినీ వర్గాల్లో వైరల్ అవుతుండగా తాను చేసిన పనికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం :