ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వీరసింహా రెడ్డి”.?

Published on Nov 24, 2022 8:07 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తో చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి”. బాలయ్య నుంచి “అఖండ” లాంటి భారీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అనేక అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతూ ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు తెలుస్తుంది.

ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి డీల్ ని అయితే లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా కోసం గాను వారు ఫ్యాన్సీ ధరనే ఇచ్చినట్టుగా కూడా టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :