‘వీర సింహారెడ్డి’తో థమన్ మళ్లీ అదరగొడతాడట !

‘వీర సింహారెడ్డి’తో థమన్ మళ్లీ అదరగొడతాడట !

Published on Dec 5, 2022 7:32 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న ‘వీర సింహారెడ్డి’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కాగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ఆల్బమ్‌ కు థమన్ కంపోజిషన్స్ ను పూర్తి చేశాడు. అలాగే నేపథ్య సంగీతం పరంగా కూడా థమన్ మెయిన్ ట్రాక్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందట.

ఇక శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రుతిహాసన్ లుక్‌కి సంబంధించిన కొత్త అప్‌డేట్ త్వరలో రానుంది. పైగా శ్రుతిహాసన్ తన కెరీర్‌లో బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి. మరి ఈ జోడి స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు