మాస్ బీట్ తో దుమ్మురేపిన ‘వీరసింహారెడ్డి’ ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ప్రోమో

మాస్ బీట్ తో దుమ్మురేపిన ‘వీరసింహారెడ్డి’ ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ప్రోమో

Published on Dec 23, 2022 10:00 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే వీరసింహారెడ్డి నుండి రిలీజ్ అయిన జై బాలయ్య, సుగుణ సుందరి సాంగ్స్ రెండూ కూడా ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ మూవీ నుండి మా బావ మనోభావాలు అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సాంగ్ యొక్క ప్రోమో ని కొద్దిసేపటి క్రితం అఫీషయల్ గా రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ ప్రోమోలో బాలకృష్ణ వేసిన మాస్ స్టెప్స్ అలానే, సాంగ్ ట్యూన్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. ఇక ఫుల్ సాంగ్ ని రేపు మధ్యాహ్నం 3 గం. 19 ని. లకు రిలీజ్ చేయనున్నారు. వీరసింహారెడ్డి మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు