“వీరమల్లు” రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

“వీరమల్లు” రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Published on Jun 22, 2024 2:01 PM IST


పవర్ స్టార్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాల్లో తన మొదటి భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి మరి ఈ చిత్రాన్ని మొదటిగా చాలా వరకు షూటింగ్ ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా ఇక నుంచి మిగిలిన షూటింగ్ ని నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేపట్టారు.

మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పునః ప్రారంభం అవుతుంది అనేది ఆసక్తిగా మారగా దీనిపై నిర్మాత ఏ ఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. పవన్ ఈ జూలై మొదటి వారంలో వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవుతారు అని వస్తున్నా వార్తలపై మాట్లాడుతూ ప్రస్తుతం అందులో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ చేశారు.

పవన్ త్వరలోనే జాయిన్ అవుతారు కానీ తనకి ఉన్న ఈ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాక వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని క్లారిటీ ఇచ్చారు. అలాగే పవన్ నటించాల్సిన భాగం కేవలం కొన్ని రోజులు మాత్రమే బాలన్స్ ఉందని తెలిపారు. దీనితో అయితే కొంచెం ఆలస్యం గానే సినిమా మొదలవుతుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు