ఓటిటి రాకకి సిద్ధమవుతున్న “వీరసింహా రెడ్డి”.!

Published on Feb 12, 2023 8:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి”. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఈ అవైటెడ్ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకొని ఓటిటి రాక కి అయితే సిద్ధం అవుతుంది.

ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నట్టుగా హాట్ స్టార్ వారు అనౌన్స్ చేశారు. అయితే డేట్ ఇంకా లాక్ చెయ్యలేదు కానీ ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని బజ్ వినిపిస్తుంది. అలాగే ఈ డేట్ పై కూడా వారి నుంచి అతి త్వరలోనే అనౌన్సమెంట్ అయితే రానుంది. ప్రస్తుతం అఖండ తర్వాత వీరసింహా రెడ్డి స్ట్రీమింగ్ ని అయితే వారు కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :