మాస్ ఎలిమెంట్స్ తో “వీరసింహా రెడ్డి” మేకింగ్ వీడియో.!

మాస్ ఎలిమెంట్స్ తో “వీరసింహా రెడ్డి” మేకింగ్ వీడియో.!

Published on Dec 31, 2022 2:00 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం అయితే ఆల్రెడీ ఆడియో పరంగా సూపర్ హిట్ కాగా మేకర్స్ ఎప్పటికప్పుడు మంచి హైప్ ఎక్కించే పనిలో పడ్డారు.

అలా లేటెస్ట్ గా ఈ కొత్త సంవత్సరం ట్రీట్ గా సాలిడ్ మేకింగ్ వీడియో ని ఇప్పుడు మేకర్స్ అందించారు. మరి ఇది అయితే కంప్లీట్ మాస్ విజువల్స్ తో కనిపిస్తుంది. సినిమాలో కీలక సన్నివేశాలు సహా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నందమూరి మోక్షజ్ఞ కూడా ఇందులో మంచి చార్మింగ్ గా సెట్స్ లో కనిపించడం విశేషం అని చెప్పాలి.

ఇక బాలయ్య మాస్ ప్రెజెన్స్ తనపై చూపించిన సీన్స్ కి థియేటర్స్ షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇలా మాస్ ఎలిమెంట్స్ తో ఈ మేకింగ్ వీడియో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు