ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో “వీరసింహా రెడ్డి” వీర మాస్..!

Published on Jan 13, 2023 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” భారీ హిట్ టాక్ తెచ్చుకుని బాలయ్య కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలవనుంది అని అందరికీ అర్ధం అయ్యిపోయింది. మరి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక ప్రాంతాల్లో అదిరే వసూళ్లు నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తుండగా ఇక నైజాం లో సినిమాకి ఇచ్చిన లిమిటెడ్ టికెట్ ధరలతోనే సెన్సేషనల్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

మరి మొదటి రోజు వీరసింహా రెడ్డి అయితే అక్కడ 43 లక్షలకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం అక్కడ భారీ హైక్స్ ఇచ్చిన చిత్రాలతో సరిసమానంగా పెర్ఫామ్ చేసింది అని చెప్పాలి. అలాగే వాటిలానే గట్టి హైక్ ఉండి ఉంటే డెఫినెట్ గా వీరసింహా రెడ్డి క్రాస్ రోడ్స్ లో టాప్ 3 చిత్రంగా నిలిచి ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ రేట్స్ తో కూడా ఈ చిత్రం అయితే అక్కడ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న నాల్గవ చిత్రంగా నిలిచింది.

సంబంధిత సమాచారం :