లేటెస్ట్ : ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

లేటెస్ట్ : ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Nov 23, 2022 6:28 PM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ వీరసింహారెడ్డి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్ మోషన్ పోస్టర్ ఆ అంచనాలు మరింతగా పెంచాయి.

ఇక ఈ భారీ మాస్ యాక్షన్ మూవీ నుండి ‘జై బాలయ్య’ రాజసం నీ ఇంటిపేరు అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని నవంబర్ 25న ఉదయం 10 గం. 29. ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. కాగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు