పెళ్లి పై ‘వీరసింహారెడ్డి’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 28, 2023 12:07 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా మలయాళ నటి హనీరోజ్ టాలీవుడ్ ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆలయం అనే మూవీ ద్వారా ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఇటీవల విజయవాడ లో ఒక బేకరీ ఓపెనింగ్ లో సందడి చేసిన హనీ రోజ్ మీడియాతో మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి తనకు నటన పై ఎంతో ఆసక్తి ఉండేదని, ఆ తరువాత నటిగా మారిన అనంతరం ఆడియన్స్ నుండి మంచి పేరు లభించడం ఆనందంగా ఉందన్నారు. వీరసింహారెడ్డి లో మీనాక్షి పాత్ర తనకు ఎంతో సంతృప్తిని పేరుని అందించిందని తెలిపారు. అయితే తన పెళ్లి ఎప్పుడు అని పలువురు అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో, పెళ్లి అనేది పెద్ద బాధ్యతని, తాను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని, వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని అభిప్రాయపడ్డారు. కాగా తెలుగులో హానీ రోజ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :