‘వీరసింహారెడ్డి’ జై బాలయ్య సాంగ్ విజువల్ గా కూడా అదుర్స్ అట

‘వీరసింహారెడ్డి’ జై బాలయ్య సాంగ్ విజువల్ గా కూడా అదుర్స్ అట

Published on Nov 26, 2022 3:00 AM IST


లేటెస్ట్ గా నటసింహం బాలకృష్ణతో యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి నేడు జై బాలయ్య అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ సాంగ్ కి బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ రాగా ఈ సాంగ్ కి థమన్ అందించిన ట్యూన్ తో పాటు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పై కూడా మంచి స్పందన లభించింది.

అయితే ఈ సాంగ్ కేవలం ఆడియో పరంగాను కాక విజువల్ గా కూడా అదుర్స్ అనే రేంజ్ లో డైరెక్టర్ గోపీచంద్ ఈ సాంగ్ ని అద్భుతంగా తెరకెక్కించారని ఇన్నర్ వర్గాల బజ్. త్వరలో మూవీ రిలీజ్ తరువాత ఈ సాంగ్ కి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ థియేటర్స్ లో హంగామా చేయడం ఖాయం అంటున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి నుండి నెక్స్ట్ సాంగ్ యొక్క అప్ డేట్ త్వరలోనే రానుండగా మూవీని 2023 సంక్రాంతికి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ మూవీలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రవిశంకర్, లాల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు