సక్సెస్ఫుల్ గా మూడవ వారంలోకి అడుగుపెట్టిన ‘వీరసింహారెడ్డి’

Published on Jan 27, 2023 11:31 pm IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ వారి భారీ నిర్మాణంలో తాజగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ వీరసింహారెడ్డి. యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్, లాల్ వంటి వారు నటించారు.

ఇక ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక నేటి నుండి సక్సెస్ఫుల్ గా మూడవ వారంలోకి అడుగుపెట్టింది వీరసింహారెడ్డి మూవీ. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో పెర్ఫార్మన్స్ అదరగొట్టగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీని తెరకెక్కించారు. థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు రిషి పంజాబీ విజువల్స్ ఈ మూవీకి మరింతగా ప్లస్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :