ఫ్యామిలీ అంతా కలిసి “ఎఫ్3” ని ఎంజాయ్ చేయవచ్చు – విక్టరీ వెంకటేష్

Published on May 10, 2022 3:00 pm IST


వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 ట్రైలర్ నిన్న విడుదలై ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్‌ని అందుకుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ లోని ఏఎంబీ సినిమాస్‌లో సక్సెస్‌ వేడుకలు జరిగాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 27, 2022 న గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, “ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఎఫ్‌2 కంటే సినిమా అలరిస్తుంది. కోవిడ్‌ తర్వాత నా రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్‌3 తో థియేటర్‌లో మీ అందరినీ కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు, అనిల్ రావిపూడి గారు అద్భుతమైన స్క్రిప్ట్‌ని రూపొందించారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్3. మే 27న థియేటర్లలోకి రాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, మురళీశర్మ, అలీ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ ఫన్ ఫుల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :