రానా తో “రానా నాయుడు” అంటూ విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్…స్టైలిష్ లుక్ లో వెంకీ మామ!

Published on Sep 22, 2021 11:20 am IST


విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి కలిసి నటిస్తే చూసేందుకు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో రానా తో కలిసి వెంకటేష్ స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ త్వరలో తీయబోయే వెబ్ సిరీస్ లో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. రానా నాయుడు అంటూ సరికొత్త టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను రానా మరియు వెంకటేష్ లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఈ ఫోటో లో రానా దగ్గుపాటి మరియు వెంకటేష్ లు ఉండగా, వెంకటేష్ సరికొత్తగా, స్టైలిష్ గా ఉన్నారు. రానా ను చిన్న పిల్లాడు నుండి ఎదిగే వరకూ, ఒక నటుడు అయ్యే వరకు చూసా అని వెంకటేష్ అన్నారు. రానా సైతం వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :