ఆ రీమేక్‌లో తండ్రీ, కొడుకులుగా వెంకీ, రానా?

Published on Feb 2, 2022 3:00 am IST

మలయాళ హిట్ సినిమాలు ఈ మధ్య తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. ఇటీవల మలయాళంలో విడుదలైన “బ్రో డాడీ” సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకి ఈ చిత్రం నచ్చడంతో ఆయన తాజాగా ఈ చిత్రం యొక్క తెలుగు రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

అయితే వెంకటేష్ మరియు రానా ప్రధాన పాత్రలుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా, పృథ్వీరాజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ కనిపించారు. దీంతో ఈ రీమేక్తో వెంకటేశ్-రానా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :