రానా, వెంకటేష్ ల ‘రానా నాయుడు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 14, 2023 9:08 pm IST


స్టార్ నటులు విక్టరీ వెంకటేష్, దగ్గబుబాటి రానా తొలిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. మొదటి నుండి అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా ఇద్దరూ కూడా విభిన్నమైన పాత్రలు చేస్తుండగా కరణ్ అన్షుమన్ మరియు సుపర్న్ వర్మ దీనిని ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చెప్తోంది యూనిట్.

ప్రముఖ అమెరికన్ టివి సిరీస్ రే డొనోవన్ ఆధారంగా తెరకెక్కుతున్న రానా నాయుడు కి సంబంధించి నేడు వెంకటేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక వీడియో బైట్ రిలీజ్ చేయగా దానికి సమాధానం ఇస్తూ రానా దగ్గుబాటి మరొక వీడియో బైట్ రిలీజ్ చేసారు. ఇక ఇందులో రానా ప్రస్తావిస్తూ రానా నాయుడు ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. మరి అందరిలో ఈ విధంగా ఎంతో ఆసక్తిని రేపిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :