వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టి స్టారర్ ఫిక్స్ !

రాజా ది గ్రేట్ సినిమా తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి మల్టి స్టారర్ సినిమా చెయ్యబోతున్నాడు. వెంకటేష్ ఈ సినిమాలో నటించబోతున్నాడని ముందుగానే ప్రకటించారు చిత్ర యూనిట్. రెండో హీరోగా ఎవరు నటిస్తారనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. తాజా సమాచారం మేరకు వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ లో యాక్ట్ చెయ్యబోతున్న11ట్లు సమాచారం.

ఈ సినిమాకి F2 అనే టైటిల్ పెట్టడం జరిగింది. (ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ) అనేది ట్యాగ్ లైన్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. కామిడి తియ్యడంలో అనిల్ రావిపూడి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కూడా అదే స్టైల్ లో ఉండబోతుందేమో చూద్దాం.